(4-5) “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగల వారని, ప్రముఖులమని తలుస్తారు. కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబతాను.”
దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖడో దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు. ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది. అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలి కలతో నిండివుంది. ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు. దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.