1
|
దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా? నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా? |
2
|
చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందిన వాళ్లం. నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకోనుము. |
3
|
దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము. శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము. |
4
|
శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు. యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు. |
5
|
శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను నరికే మనుష్యుల్లా ఉన్నారు. |
6
|
ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా, నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు. |
7
|
దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు. వారు నీ ఆలయాన్ని నేల మట్టంగా కూల్చివేశారు. ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్నించబడింది. |
8
|
శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు. దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు. |
9
|
మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము. ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు. ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు. |
10
|
దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు? నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా? |
11
|
దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శక్షించావు.? నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు. |
12
|
దేవా చాల కాలంగా నీవే మా రాజువు. నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు. |
13
|
దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు. |
14
|
మకరపు తలలను నీవు చితుకగొట్టావు. దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు. |
15
|
జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు. మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు. |
16
|
దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు. సూర్యుని, చంద్రుని నీవే చేశావు. |
17
|
భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు. వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు. |
18
|
దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను ఆవమానించాడని జ్ఞాపకం. చేసుకో. ఆ తెలివి తక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు. |
19
|
దేవా, ఆ అడవి, మృగాలను నీ పావురాన్ని తీసుకోనివ్వకుము. నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచి పోకుము. |
20
|
నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకోనుము. ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది. |
21
|
దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది. వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము. నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు. |
22
|
దేవా, లేచి పోరాడుము. ఆ తెలివి తక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకోము. |
23
|
ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము. ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు. |
Psalms 74:12 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...