1
|
దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము. ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక! |
2
|
గాలికి ఎగిరిపోయే పొగలా నీ శత్రువులు చెదరిపోవుదురుగాక. అగ్నిలో మైనం కరిగిపోయేలా నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక. |
3
|
కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు. మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు. |
4
|
దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి. ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు. ఆయన పేరు యాహ్ . ఆయన నామాన్ని స్తుతించండి. |
5
|
ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు. దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు. |
6
|
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు. |
7
|
దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు. ఎడారిగుండా నీవు నడిచావు. |
8
|
భూమి కంపించింది. దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది. |
9
|
దేవా, నీవు వర్షం కురిపించావు మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు. |
10
|
నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి. దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచి వాటిని యిచ్చావు. |
11
|
దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు. |
12
|
“శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి. యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు. ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను సంచుకొంటారు. |
13
|
వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.” |
14
|
సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు. వారు పడిపోతున్న మంచులా ఉన్నారు. |
15
|
బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి. |
16
|
బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు? దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు. యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు. |
17
|
యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు. ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి. |
18
|
ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు. ఆయన తన బందీల బృందాలను నడిపించాడు. ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు . |
19
|
యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. |
20
|
ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు. మన యోహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు. |
21
|
దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు . దేవుడు తనకు విరోధంగా పోరాడిన వారిని శిక్షిస్తాడు. |
22
|
నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను. సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను. |
23
|
కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.” |
24
|
విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు. నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు. |
25
|
గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు. మధ్యలో ఆడపడుచులు తంబరలు వాయిస్తారు. |
26
|
మహా సమాజంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి. |
27
|
చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు. యూదా మహా వంశం అక్కడ ఉంది. జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు. |
28
|
దేవా, నీ శక్తి మాకు చూపించుము, దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము. |
29
|
రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు, యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు. |
30
|
ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము. ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము ఆ రాజ్యాలను యుద్ధంలో నీవు ఓడించావు. ఇప్పుడు వారు నీ వద్దకు వెండి తీసుకొని వచ్చు నట్లు చేయుము. |
31
|
వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము. దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము. |
32
|
భూ రాజులారా దేవునికి పాడండి. మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి. |
33
|
దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు. ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి. |
34
|
మీ దేవుళ్లు అందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు. |
35
|
దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తి, బలాన్ని ఇస్తాడు. దేవుని స్తుతించండి. |
Psalms 68:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...