1
|
భూమి మీద ఉన్న సమస్తమా దేవునికి ఆనందధ్వని చేయుము! |
2
|
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి. |
3
|
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి. దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం. |
4
|
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక. నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక. |
5
|
దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. |
6
|
సముద్రాన్ని ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు. ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు . అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు. |
7
|
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు. ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు. |
8
|
ప్రజలారా మా దేవుని స్తుతించండి. స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి. |
9
|
దేవుడు మాకు ఆ జీవాన్ని ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. |
10
|
దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. |
11
|
దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు. భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు. |
12
|
మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు. అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు. కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు. |
13
|
[This verse may not be a part of this translation] |
14
|
[This verse may not be a part of this translation] |
15
|
నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను. నేను నీకు పొట్టేళ్లతో ధూపం ఇస్తున్నాను. నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను. |
16
|
దేవుని ఆరాధించే ప్రజలారా మీరంతా రండి. దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబతాను. |
17
|
నేను ఆయన్ని ప్రార్థించాను. నేను ఆయన్ని స్తుతించాను. |
18
|
నా హృదయం పవిత్రంగా ఉంది. కనుక నా యెహోవా నా మాట విన్నాడు. |
19
|
దేవుడు నా మొరను విన్నాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. |
20
|
దేవుని స్తుతించండి! నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు. దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు! |
Psalms 66:10 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...