1
|
దేవా, నా ప్రార్థన ఆలకించుము. నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము. |
2
|
నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము. ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము. |
3
|
వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు. వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి. |
4
|
వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీ పరుని మీద వేస్తారు. అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడ్డాడు. |
5
|
అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు. “వారు వారి ఉరులను పెడతారు.” వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని వారనుకొంటారు. |
6
|
మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు. మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతోకష్టం. |
7
|
కాని దేవుడు తన “బాణాలను”వారిమీద వేయగలడు. అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు. |
8
|
దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు. కానీ దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు. ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు. అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు. |
9
|
దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు. వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు. ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు. |
10
|
మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి. వారు ఆయన్ని నమ్ముకోవాలి. మంచి మనుష్యులారా మీరంతా యెహోవాను స్తుతించండి. |
Psalms 64:6 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...