1
|
దేవా నీ నమ్మకమైన ప్రేమ మూలంగా నా మీద దయ చూపించుము. నీ మహా దయ మూలంగా నా పాపాలన్నీ తుడిచివేయుము. |
2
|
దేవా, నా దోషం అంతా తీసివేయుము. నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము. |
3
|
నేను పాపం చేశానని నాకు తెలుసు. నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను. |
4
|
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను. దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను. కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే. నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే. |
5
|
నేను పాపంలో పుట్టాను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది. |
6
|
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు. అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము. |
7
|
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము. నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము. |
8
|
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము. నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము. |
9
|
నా పాపాలను చూడకుము! వాటన్నింటినీ తుడిచి వేయుము. |
10
|
దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము నా ఆత్మను నూతనపరచి బలపరచుము. |
11
|
నన్ను తోసివేయకుము! నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము. |
12
|
నీచేత రక్షించబడుట మూలంగా కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము! నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము. |
13
|
నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను. వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు. |
14
|
దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము. నా దేవా, నీవే నా రక్షకుడవు. నీవు ఎంత మంచివాడవోనని నన్ను పాడనిమ్ము. |
15
|
నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము. |
16
|
నీవు బలులు కోరటం లేదు. లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు. |
17
|
దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు. |
18
|
దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము. యెరూషలేము గోడలను కట్టుము. |
19
|
[This verse may not be a part of this translation] |
Psalms 51:15 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...