1
|
దేవాది దేవుడు యెహోవా మాట్లాడాడు. సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు. |
2
|
సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది. |
3
|
మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. ఆయన యెదుట అగ్ని మండుతుంది. ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది. |
4
|
తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని, కింద భూమిని ఆయన పిలుస్తున్నాడు. |
5
|
“నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి. వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు “ అని చెప్పారు. |
6
|
అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి. ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి. |
7
|
దేవుడు చెబతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి. ఇశ్రాయేలు ప్రజలారా మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను. నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి. |
8
|
నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు. ఇశ్రాయేలు ప్రజలారా మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు. |
9
|
మీ ఇంటినుండి యెద్దులను తీసుకోను. మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు. |
10
|
ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. |
11
|
కొండల్లో వుండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో చలించే ప్రతీదీ నా సొంతం |
12
|
నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం. |
13
|
నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం తాగను.” |
14
|
దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి, దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి. |
15
|
“ఇశ్రాయేలు ప్రజలారా మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి! నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.” |
16
|
దుర్మార్గులతో దేవుడు చెబతున్నాడు, “నా న్యాయ విధులను చదువుటకు నా ఒడంబడికకు బద్దులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది? |
17
|
కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు. నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు. |
18
|
మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడుతారు. వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు. |
19
|
మీరు చెడు సంగతులు చెబతారు, అబద్ధాలు పలుకుతారు. |
20
|
మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబతారు. మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు. |
21
|
మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు. కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను. మరియు మీ ముఖంమీద నిందమోపుతాను. |
22
|
నేను మిమ్ములను చీల్చివేయకముందే, దేవుని మరచిన జనాంగమైన మీరు, ఈ విషయంను గూర్చి ఆలోంచించాలి. అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు. |
23
|
[This verse may not be a part of this translation] |
Psalms 50:6 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...