1
|
రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి. నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి. |
2
|
నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు! నీ పెదవులనుండి దయ వెలువడుతుంది కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు. |
3
|
నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరుడువలె, మహిమను, ఘనతను ధరించుము. |
4
|
నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము. అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము. |
5
|
నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు. |
6
|
దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది! నీ నీతి రాజదండమయి ఉంది. |
7
|
నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును నీవు ద్వేషిస్తావు. కనుక దేవా, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా నీ దేవుడు కోరుకొన్నాడు. |
8
|
నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగి, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి. నిన్ను సంతోషపరచుటకు దంతం పొదుగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది. |
9
|
నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమారైలున్నారు. నీ పెండ్లి కుమారై ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది. |
10
|
కుమారీ, నా మాట వినుము. నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్నీ మరచిపోకుము. |
11
|
రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే నీకు కొత్త భర్తగా ఉంటాడు. నీవు ఆయన్ని ఘనపరుస్తావు. |
12
|
తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు. నీ కోసం ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు. |
13
|
రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది. ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది. |
14
|
ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది. ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది. |
15
|
సంతోషంతో నిండిపోయి వారు వస్తారు. సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు. |
16
|
రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు. దేశవ్యాప్తంగా వారిని రాజులుగా నీవు చేస్తావు. |
17
|
నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను. శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు. |
Psalms 45:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...