1
|
దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు తాగాలని ఆశిస్తుంది. అలాగే దేవా నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది. |
2
|
సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది. ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను? |
3
|
నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం. “నీ దేవుడు ఎక్కడ? అంటూనే ఉన్నాడు నా శత్రువు ఎంతసేపూను. “ |
4
|
కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము. నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం. అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం. |
5
|
నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను? ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది. ఆయన నన్ను కాపాడుతాడు. |
6
|
నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను. కనుక నేను నిన్ను యోర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండ నుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను. |
7
|
నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాతంలో నుండి పిలుస్తోంది. నీ అలలు, అన్నియు నామీదుగా దాటియున్నవి. |
8
|
ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చుపిస్తాడు. అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను. |
9
|
ఆశ్రయ బండ ఆయిన నా దేవునితో, “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను. |
10
|
నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు. “నీ దేవుడు ఎక్కడ”అని వారు అన్నప్పుడు “వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.” |
11
|
నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది. నా సహాయమా! నా దేవా! |
Psalms 42:2 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...