1
|
దుర్మార్గుల పట్ల కోపగించకుము చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు. |
2
|
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి. దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు. |
3
|
నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే నీవు బతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు. |
4
|
యెహోవాను సేవించటంలో ఆనందించుము. ఆయన నీకు కావల్సిన వాటినియిస్తాడు. |
5
|
యెహోవా మీద ఆధారపడుము ఆయనను నమ్ముకొనుము. జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు. |
6
|
నీ మంచితనం, న్యాయం మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము. |
7
|
యెహోవాను నమ్ముకోనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము. చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము. చెడ్డవాళ్లు చెడు తలంపులు తలచగా వారి తలంపులు జయించినప్పుడు కలవర పడకుము. |
8
|
కోపగించ వద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపిస్తే అంతగా తొందరపడిపోకుము. |
9
|
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు. కానీ సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది. |
10
|
కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు. అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు. |
11
|
దీనులు భూమిని జయిస్తారు, వాళ్లు శాంతిని అనుభవిస్తారు. |
12
|
దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు. ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు. |
13
|
అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు, వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు. |
14
|
దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు. మంచి వాళ్లను, నిజాయితి పరులను వాళ్లు చంపాలని చూస్తారు. |
15
|
కానీ వారి విల్లులు విరిగిపోతాయి. వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి. |
16
|
దుష్టుల ఐశ్వర్యంకంటే మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది. |
17
|
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు. కానీ మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు. |
18
|
పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు. వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది. |
19
|
కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు. కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది. |
20
|
కానీ దుర్మార్గులు యెహోవాకు శత్రువులు, ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు. వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు. వారు పొగవలె కనబడకుండా పోతారు. |
21
|
దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు. కానీ మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు. |
22
|
ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు. కానీ ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు. |
23
|
ఒక సైనికుడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు. వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు. |
24
|
సైనికుడు తొట్రుపడినా పడిపోడు, ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు. |
25
|
నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను. మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు. మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు. |
26
|
మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు. మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు. |
27
|
నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు. |
28
|
యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు. యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు. కానీ దుష్టులను ఆయన నాశనం చేస్తాడు. |
29
|
మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది. వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు. |
30
|
మంచి మనిషి మంచి సలహా యిస్తాడు. అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి. |
31
|
యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి. అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు. |
32
|
కానీ చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు. మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు. |
33
|
యెహోవా దుష్టుల శక్తికి మంచి వారిని వదిలి వేయడు. మంచి వారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు. |
34
|
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము. దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు, మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు. |
35
|
శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను. వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది. |
36
|
కానీ తర్వాత వారు లేకుండా పోయారు. నేను వారికోసం చూశాను, కానీ వారు నాకు కనబడలేదు. |
37
|
నీతి, నిజాయితీ కలిగి ఉండి, సమాధానపరచు వారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది. |
38
|
అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు. |
39
|
నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు. నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు. |
40
|
[This verse may not be a part of this translation] |
Psalms 37:4 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...