Indian Language Bible Word Collections
Psalms 37:2
Psalms Chapters
Psalms 37 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Psalms Chapters
Psalms 37 Verses
1
దుర్మార్గుల పట్ల కోపగించకుము చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి. దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3
నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే నీవు బతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4
యెహోవాను సేవించటంలో ఆనందించుము. ఆయన నీకు కావల్సిన వాటినియిస్తాడు.
5
యెహోవా మీద ఆధారపడుము ఆయనను నమ్ముకొనుము. జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6
నీ మంచితనం, న్యాయం మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7
యెహోవాను నమ్ముకోనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము. చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము. చెడ్డవాళ్లు చెడు తలంపులు తలచగా వారి తలంపులు జయించినప్పుడు కలవర పడకుము.
8
కోపగించ వద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపిస్తే అంతగా తొందరపడిపోకుము.
9
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు. కానీ సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10
కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు. అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11
దీనులు భూమిని జయిస్తారు, వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
12
దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు. ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13
అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు, వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14
దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు. మంచి వాళ్లను, నిజాయితి పరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15
కానీ వారి విల్లులు విరిగిపోతాయి. వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16
దుష్టుల ఐశ్వర్యంకంటే మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు. కానీ మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18
పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు. వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19
కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు. కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20
కానీ దుర్మార్గులు యెహోవాకు శత్రువులు, ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు. వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు. వారు పొగవలె కనబడకుండా పోతారు.
21
దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు. కానీ మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22
ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు. కానీ ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23
ఒక సైనికుడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు. వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24
సైనికుడు తొట్రుపడినా పడిపోడు, ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25
నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను. మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు. మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26
మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు. మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27
నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28
యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు. యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు. కానీ దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29
మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది. వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30
మంచి మనిషి మంచి సలహా యిస్తాడు. అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31
యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి. అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.
32
కానీ చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు. మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33
యెహోవా దుష్టుల శక్తికి మంచి వారిని వదిలి వేయడు. మంచి వారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము. దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు, మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.
35
శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను. వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36
కానీ తర్వాత వారు లేకుండా పోయారు. నేను వారికోసం చూశాను, కానీ వారు నాకు కనబడలేదు.
37
నీతి, నిజాయితీ కలిగి ఉండి, సమాధానపరచు వారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38
అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
39
నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు. నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40
నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు. నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.