English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Psalms Chapters

Psalms 3 Verses

1 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు. అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.
3 ఆయితే, యెహోవా, నీవు నాకు కేడెము. నీవే నా అతిశయం. యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా [*నీవు … ప్రముఖునిగా అక్షరాల నాతల పై కెత్తువాడవు నీవే.] చేస్తావు.
4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను. ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!
5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును. ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కానీ ఆ శత్రువులకు నేను భయపడను.
7 యెహోవా, లెమ్ము [†యెహోవా, లెమ్ము ఒప్పందపు పెట్టెను ప్రజలు పై కెత్తి, యుద్ధంలోకి తీసుకొని పోయినప్పుడు ఇలా చెప్పేవారు. అనగా దేవుడు వారితో ఉన్నాడని అర్థం.] నా దేవా, వచ్చి నన్ను రక్షించుము! నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి, వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.
8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు. యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.
×

Alert

×