యెహోవా, నీవే నా అండవు. సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను. నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు. సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము. ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం” [*షాలోం అనగా శాంతి అని అర్థం.] అని అభినందిస్తారు. కానీ వారి హృదయాల్లో వారి పొరుగు వారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వైస్తున్నారు.
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి [†ఏర్పాటు చేసుకొన్నవానికి అభిషేకించబడ్డ వానికి సాధారణంగా ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజు.] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.