1
|
యెహోవా, నీవే నా అండవు. సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను. నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు. సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను. |
2
|
యెహోవా, నేను నా చేతులు ఎత్తి, నీ అతి పవిత్ర స్థలం వైపు ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము. నా మీద దయ చూపించుము. |
3
|
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము. ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం “ అని అభినందిస్తారు. కానీ వారి హృదయాల్లో వారి పొరుగు వారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వైస్తున్నారు. |
4
|
యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు. కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము. ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము. |
5
|
యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు. ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు. వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు. |
6
|
యెహోవాను స్తుతించండి. కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు. |
7
|
యెహోవా నా బలం ఆయనే నా డాలు. నేను ఆయనను నమ్ముకొన్నాను. ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను. |
8
|
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు. |
9
|
దేవా, నీ ప్రజలను రక్షించుము. నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము. కాపరిలా వారిని నిత్యం నడిపించుము. |
Psalms 28:2 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...