1
|
యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము. నా ప్రార్థనా గీతం వినుము. యదార్థమైన నా ప్రార్థన వినుము. |
2
|
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది. నీవు సత్యాన్ని చూడగలవు. |
3
|
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు దాన్ని లోతుగా చూశావు. రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు. నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తల పెట్టలేదు. |
4
|
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు నేను మానవ పరంగా సాధ్యమైనతం కష్టపడి ప్రయత్నించాను. |
5
|
నేను నీ మార్గాలు అనుసరించాను. నీ జీవిత విధానం నుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు. |
6
|
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు. కనుక ఇప్పుడు నా మాట వినుము. |
7
|
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము. నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము. నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము. |
8
|
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము. నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము. |
9
|
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారి నుండి నన్ను కాపాడుము. |
10
|
ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు. |
11
|
ఆ మనుష్యులు నన్ను తరిమారు. ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు. నన్ను నేలకు పడ గొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు. |
12
|
చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు. వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు. |
13
|
యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపొయేటట్టుగా చేయుము. నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. |
14
|
యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవ ప్రజల దేశంలో నుండి ఆ దుర్మార్గులను తొలగించుము. యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి వాళ్ల కడుపులను నింపుము. ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది. |
15
|
న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను. మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను |
Psalms 17:9 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...