1
|
దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము. |
2
|
“యెహోవా, నీవు నా యజమానివి నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభీస్తుంది” అని నేను యోహోవాతో చెప్పాను. |
3
|
దేశములో పవిత్రమైనవి అని పిలుపబడే విగ్రహములకు సంబంధించిన వాటియందు ఆనందించు వారందరు శాపగ్రస్తులగుదురు గాక! |
4
|
కానీ ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది. ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను. ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను. |
5
|
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది. యెహోవా, నీవే నన్ను బలపరచావు. యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము. |
6
|
నా వంతు చాలా అద్భుతమయింది. నా స్వాస్థ్యము చాలా అందమయింది. |
7
|
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను. రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి. |
8
|
నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను. ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు. నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను. |
9
|
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి. నా శరీరం కూడ క్షేమంగా బతుకుతుంది. |
10
|
ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక. నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు. |
11
|
సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు. యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది. నీ కుడిపక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది. |
Psalms 16:4 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...