1
|
యెహోవాను స్తుతించండి. యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి. |
2
|
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి. సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి. |
3
|
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతించ నివ్వండి. |
4
|
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. ఆయన వారిని రక్షించాడు! |
5
|
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి. పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి. |
6
|
ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని |
7
|
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక. |
8
|
ఆ రాజులకు, ప్రముఖులకు దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు. |
9
|
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు. దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు. యెహోవాను స్తుతించండి! |
Psalms 149:5 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...