1
|
యెహోవా, నా ప్రార్థన వినుము. నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబుయిమ్ము. నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము. |
2
|
నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు. నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు. |
3
|
కానీ నా శత్రువులు నన్ను తరుముతున్నారు. వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు. ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. |
4
|
నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది. నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను. |
5
|
కానీ చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను. నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను. యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను. |
6
|
యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను. ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను. |
7
|
యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము! నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను. నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము. సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము. |
8
|
యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము నేను నిన్ను నమ్ముకొన్నాను. సరియైన మార్గాన్ని నాకు చూపించుము. నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను! |
9
|
యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. |
10
|
నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము. నీవు నా దేవుడవు. |
11
|
యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు నన్ను జీవించనిమ్ము. నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. |
12
|
యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి, నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము. ఎందుకంటే నేను నీ సేవకుడను. |
Psalms 143:6 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...