1
|
యెహోవా, నన్ను రక్షించుము! మంచి మనుష్యులంతా పోయారు. భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు. |
2
|
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు. ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు. |
3
|
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి. పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసి వేయాలి. |
4
|
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి. మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.” అని ఆ ప్రజలు ఈ సంగతులు చెప్పుకొంటారు. |
5
|
కానీ యెహోవా చెబుతున్నాడు, “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు. ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు. కానీ ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.” |
6
|
యెహోవా మాటలు సత్యం, నిర్మలం. నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి. కరిగించబడి ఏడుసార్లు పోయ బడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి. |
7
|
యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు. ఇప్పుడు, శాశ్వతంగానూ నీవు వారిని కాపాడుతావు. |
8
|
మనుష్యుల మధ్యలో దుష్టత్వము చెడుతనము పెరిగినప్పుడు ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు. |
Psalms 12:2 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...