1
|
యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది. నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే. |
2
|
మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి? |
3
|
దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు. |
4
|
ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే. ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి. |
5
|
ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు. వాటికి కళ్లున్నాయి కానీ అవి చూడలేవు. |
6
|
వాటికి చెవులున్నాయి కానీ అవి వినలేవు. వాటికి ముక్కులున్నాయి కానీ అవి వాసన చూడలేవు. |
7
|
వాటికి చేతులు ఉన్నాయి కానీ అవి తాకలేవు. వాటికి కాళ్లు ఉన్నాయి కానీ అవి నడవలేవు. వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు. |
8
|
ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు. |
9
|
ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము. యెహోవా వారి బలము, ఆయన వారి డాలు. |
10
|
అహరోను వంశస్తులు యెహోవాను నమ్ముతారు. యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు. |
11
|
యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు. యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు. |
12
|
యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు. యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు. యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు. |
13
|
యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు. |
14
|
యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. |
15
|
యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు. |
16
|
ఆకాశం యెహోవాకు చెందుతుంది. కానీ భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు. |
17
|
చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు. కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు. |
18
|
ఆయితే మనం యెహోవాను స్తుతిస్తాం. మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము! యెహోవాను స్తుతించండి! |
Psalms 115:7 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...