1
|
యెహోవాను స్తుతించండి ! యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి! యెహోవా నామాన్ని స్తుతించండి. |
2
|
ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను. |
3
|
తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి, సూర్యుడు అస్తమించే స్థలం వరుకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను. |
4
|
యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు. ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం. |
5
|
ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు. దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు. |
6
|
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే ఆయన తప్పక కిందికి చూడాలి. |
7
|
దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు. భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు. |
8
|
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు. ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు. |
9
|
ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కానీ దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి! |
Psalms 113:9 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...