1
|
“నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.” అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు. |
2
|
నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది. |
3
|
నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు. నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది. ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది . |
4
|
యెహోవా ఒక వాగ్దానం చేసాడు. యెహోవా తన మనస్సు మార్చుకోడు. “నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు. నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా వున్నట్లు ఉంది.” |
5
|
నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు. ఆయన కోపమముతో రాజులను చితకగొడతాడు. |
6
|
దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు. ఆ గొప్ప దేశంలో దేవుడు చచ్చిన వారి శవాలతో నేలనిండి పోయింది! |
7
|
మార్గంలోని సెలయేటినుండి రాజు మంచినీరు తాగుతాడు. ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు. |
Psalms 110:5 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...