నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు. నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది. ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది. [*ఇప్పుడు … వస్తుంది హెబ్రీ భాషలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం. ఇది అక్షరార్థంగా: “గర్భంనుండి పరిశుద్ద ప్రకాశం నీది. నీ యౌవనపు నీ మంచు నీకు సూర్యోదయగా ఆయినది.]
యెహోవా ఒక వాగ్దానం చేసాడు. యెహోవా తన మనస్సు మార్చుకోడు. “నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు. నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా వున్నట్లు ఉంది.”
మార్గంలోని సెలయేటినుండి [†సెలయేరు ఇది యెరూషలేములో గీహోను ఊట కావచ్చు. రాజుగా అభిషేకించుటకు వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ ఆగివుండవచ్చు.] రాజు మంచినీరు తాగుతాడు. ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.