నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు. నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది. ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది .
యెహోవా ఒక వాగ్దానం చేసాడు. యెహోవా తన మనస్సు మార్చుకోడు. “నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు. నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా వున్నట్లు ఉంది.”