1
|
లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా.ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను. |
2
|
ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమాన పరచెను. |
3
|
అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి |
4
|
ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను. |
5
|
తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువు లతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను. |
6
|
షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను. |
7
|
యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతా పము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను. |
8
|
అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి. |
9
|
మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివ సించుడి. |
10
|
ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొను డని చెప్పెను. |
11
|
మరియు షెకెముమీ కటాక్షము నా మీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చె దను. |
12
|
ఓలియు కట్నమును ఎంతై నను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యు డని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను. |
13
|
అయితే తమ సహో దరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా |
14
|
మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవ మాన మగును. |
15
|
మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి; |
16
|
ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. |
17
|
మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసికొని పోవుదుమని చెప్పగా |
18
|
వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. |
19
|
ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయు టకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు |
20
|
హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జను లతో మాటలాడుచు |
21
|
ఈ మనుష్యులు మనతో సమా ధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండ నిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నదిగదా, మనము వారి పిల |
22
|
అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు. |
23
|
వారి మందలు వారిఆస్తి వారి పశువు లన్నియు మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివ సించెదరనగా |
24
|
హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరిగవినిద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవినిద్వారా వెళ్లు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. |
25
|
మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురు షుని చంపిరి. |
26
|
వారు హమో రును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి |
27
|
తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని |
28
|
వారి గొఱ్ఱలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి |
29
|
వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి. |
30
|
అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంప |
31
|
అందుకు వారువేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి. |
Genesis 34:9 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...