1
|
అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు: |
2
|
“దేవుడే పాలకుడు. ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి. దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు. |
3
|
దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు. దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు. |
4
|
కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు. స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు. |
5
|
దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు. దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు. |
6
|
మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు. పనికి మాలిన పురుగులాంటివాడు!” |
Job 25:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...