1
|
“సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయవిచారణ కోసం ఒక సమయాన్ని ఎందుకు నిర్ణయించడు? దేవునికి విధేయులయ్యే మనుష్యులు ఆ న్యాయవిచారణ నమయం కోసం అనవసరంగా ఎందుకు వేచి ఉండాలి?” |
2
|
“మనుష్యలు తమ పొరుగు వారి భూమిని ఆక్ర మించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు. మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు. |
3
|
అనాధల గాడిదను వారు దొంగాలిస్తారు. ఒక విధవవారి బాకీ తీర్చేంత వరకు ఆమె యొక్క ఆవును వారు తోలుకొని పొతారు. |
4
|
ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి సంచారం చేసేటట్టు ప్రజలను వారు బలవంతం చేస్తారు. పేద ప్రజలంతా ఈ దుర్మార్గుల బారినుండి దాగుకొనేలా బలవంతం చేయబడుతారు. |
5
|
“అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి గాడిదలా ఉన్నారు ఈ పేద ప్రజలు. పేద ప్రజలకూ వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది. |
6
|
పేద ప్రజలు ఇంకెంత వరకు వారి స్వంతం కాని పోలాలలో గడ్డి, గడ్డిపరకలు కూర్చుకోవాలి? దుర్మార్గుల ద్రాక్షాతోటల నుండి వారు పండ్లు ఏరుకొంటారు. |
7
|
పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్లబుచ్చాలి. చలిలో వారు కప్పుకొనేందుకు వారికి ఏమీ లేదు. |
8
|
కొండల్లోని వర్షానికి వారు తడిసిపోయారు. వాతా వరణం నుండి వారిని వారు కాపాడుకొనేందుకు వారికి ఏమీ లేదు కనుక వారు పెద్ద బండలకు దగ్గరలో ఉండాలి. |
9
|
దుర్మార్గులు తండ్రిలేని బిడ్డను తల్లి దగ్గర నుండి లాగివేసుకొంటారు. పేద మనిషియొక్క బిడ్డను వారు తీసివేసుకొంటారు. పేద మనిషి బాకీపడి ఉన్న దానిని చెల్లించటం కోసం దుర్మార్గులు ఆ చిన్న బిడ్డను బానిసగా చేస్తారు. |
10
|
పేద ప్రజలకు బట్టలు లేవు, కనుక వారు దిగంబరులుగా పని చేస్తారు. దుర్మార్గుల కోసం వారు పనలు మోస్తారు. కానీ పేద ప్రజలు ఇంకా ఆకలి తోనే ఉంటారు. |
11
|
పేద ప్రజలు ఒలీవ నూనె పిండుతారు. వారు ద్రాక్షాగానుగను తిప్పుతారు. కానీ వారు ఇంకా దాహంతోనే ఉంటారు. |
12
|
మరణిస్తున్న మనుష్యులు చేస్తున్న విచారకరమైన శబ్దాలు పట్టణంలో వినిపిస్తున్నాయి. బాధించబడిన మనుష్యులు సహాయం కోసం అరుస్తున్నారు. కానీ దేవుడు వినటం లేదు. |
13
|
వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు .వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు. వారు దేవుని మార్గంలో నడవరు. |
14
|
సరహంతకుడు ఉదయాన్నే లేచి పేద ప్రజలను, అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు. రాత్రివేళ అతడు దొంగగా మారిపోతాడు. |
15
|
వ్యభిచారం చేసే వాడు రాత్రి కోసం వేచి ఉంటాడు. ‘నన్ను ఎవ్వరూ చూడడం లేదు’ అని అతడు అనుకొంటాడు. కనుక అతడు తన ముఖం కప్పు కొంటాడు. |
16
|
రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు. కానీ పగటివేళ వారు వారి స్వంత ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించు కొంటారు. |
17
|
ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది. చీకటి దారుణాలకు వారు స్నేహితులు. |
18
|
కాని వరద నీటిపైనున్న నురగవలె దుర్మార్గులు తీసుకొని పోబడతారు. వారి స్వంత భూమి శపించబడింది. కనుక ద్రాక్షా తోటలలో ద్రాక్షాపండ్లు కోసే పనికి వారు వెళ్లరు. |
19
|
వేడిగా, పొడిగా ఉండే గాలి శీతాకాలపు మంచు నీళ్లను తొలగించి వేస్తుంది. అదే విధంగా దుర్మార్గులు కూడా తీసుకొని పోబడతారు. |
20
|
దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మరిచిపోతుంది. దుర్మార్గుని శరిరాన్ని పురుగులు తినివేస్తాయి. అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేనికోబడడు. దుర్మార్గులు పడి పోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు. |
21
|
దుర్మార్గులు గొడ్రాలికి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు. వారు విధవరాలికి దయ చూపెట్టరు. |
22
|
కానీ బలంగల మనుష్యులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు. బలంగల మనుష్యులు శక్తిమంతులవుతారు. కాని వారి స్వంత జీవితాలను గూర్చిన నమ్మకం వారికి లేదు. |
23
|
ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో కాని దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. |
24
|
కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. ఆ తరువాత వారు అంతమై పోతారు. మనుష్యులందరిలాగే వారూ ఒక చోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు. |
25
|
ఈ విషయాలు సత్యం కాకపోతే, నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు?” నా మాటలు వట్టివి అని ఎవరు చెప్పగలరు? |
Job 24:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...