1
|
అప్పుడు యోబు మాట్లాడటం కొన సాగించాడు: |
2
|
“ నిజంగా దేవుడు జీవిస్తున్నాడు. మరియు దేవుడు జీవించటం ఎంత సత్యమో ఆయన నాకు అన్యాయం చేశాడు. అనటం కూడ అంతే సత్యం. అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని బాధించాడు. |
3
|
కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు, |
4
|
నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు. మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం చెప్పదు. |
5
|
మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను. నేను నిర్దోషిని అని నేను చచ్చే రోజువరకు చెబుతూనే ఉంటాను. |
6
|
నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టు కొని ఉంటాను. సరియైన వాటిని చేయటం నేను ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత కాలం నా మనస్సాక్షి నన్ను బాధించదు. |
7
|
ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు. నా శత్రువులు దుర్మారులు శిక్షించబడినట్టు శిక్షించబడుదురు గాక. |
8
|
దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు అతనికి ఆశ ఏమీ ఉండదు. అతని జీవాన్ని దేవుడు తీసివేసినప్పుడు అతనికి ఆశ లేదు. |
9
|
ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి, దేవునికి మొరపెడితే దేవుడు వినడు. |
10
|
సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది. ఆ వ్యక్తి సదా దేవుని ప్రార్థించి ఉండాల్సింది. |
11
|
“దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను. సర్వశక్తిమంతుడైన దేవుని పథకాలను నేను దాచి పెట్టను. |
12
|
దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు. కనుక మీరు అలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు చెబుతారు? |
13
|
దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే. సర్వశక్తిమంతుడైన దేవుని నుండి కృర మానవులకు లభించేది ఇదే. |
14
|
ఒకవేళ దుర్మార్గునికి చాలామంది పిల్లలు ఉండ వచ్చునేమో కాని వాని పిల్లలు యుద్ధంలో చంపి వేయబడతారు. దుర్మార్గుని పిల్లలు తినేందుకు సరిపడినంత ఆహారం ఎన్నడూ ఉండదు. |
15
|
దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది. అతని కుమారుల విధవలు వారి కోసం విచారించరు. |
16
|
ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు. ఒకవేళ మట్టి పోగుల్లా అతనికి చాలా బట్టలు ఉండవచ్చును. |
17
|
దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను ఒక మంచి మనిషి ధరిస్తాడు. దుర్మార్గుని వెండిని నిర్దోషులు పంచుకొంటారు. |
18
|
దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం నిలువదు. అది సాలె గూడులా ఉంటుంది లేక కావలివాని గుడారంలా ఉంటుంది. |
19
|
దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు. కానీ ఆ తర్వాత అతను కళ్లు తెరిచినప్పుడు అతని సంపదంతా పోయినట్లు అతనికి తెలుస్తంది. |
20
|
ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టు కొంటాయి. రాత్రి వేళ ఒక తుఫాను అతణ్ణి కొట్టు కొని పోతుంది. |
21
|
తూర్పుగాలి అతణ్ణి కొట్టుకొని పొతుంది. అప్పుడు అతడు అంతమై పోతాడు. తుఫాను అతణ్ణి అతని యింటినుండి తుడుచుకుని పోతుంది. |
22
|
తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తుఫాను అతణ్ణి నిర్దాక్షిణ్యంగా కొడుతుంది. |
23
|
దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు చప్పట్లు కొడతారు. దుర్మార్గుడు తన యింటినుండి పారిపోతూంటే, వానికి విరోధంగా వాళ్లు ఈల వేస్తారు. |
Job 27:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...