1
|
యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంషుర్షణ ఉంది. అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది. |
2
|
ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి. జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా ఉన్నాడు మనిషి. |
3
|
అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడు తోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి. శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడ్డాయి. |
4
|
నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను, ‘నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది?’ అనే రాత్రి జరుగుతూనే ఉంటుంది. సూర్యుడు వచ్చేంతవరకు నేను అటూ యిటూ దొర్లుతూనే ఉంటాను. |
5
|
నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది. నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న పుండ్లతో నిండిపోయింది. |
6
|
నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి. నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం అవుతుంది. |
7
|
దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో. నా కళ్లు మంచిదానిని దేనినీ మరల చూడవు. |
8
|
నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు. నీవు నాకోసం చూస్తావు. కాని నేను చనిపోయి వుంటాను. |
9
|
ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది. అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాదిలో పాతి పెట్టబడతాడు. మరల తిరిగిరాడు. |
10
|
అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు. అతనిస్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు. |
11
|
అందుచేత నేను మౌనంగా ఉండను. నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది. నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను. |
12
|
ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు? నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా? |
13
|
నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి నా మంచం నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి |
14
|
కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపె డుతున్నావు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు. |
15
|
అందుచేత బతకటం కంటె గొంతు నులుమి చంపబడటం నాకు మేలు. |
16
|
నా బదుకు నాకు అసహ్యం. నేను శాశ్వతంగా జీవించాలని కోరను నన్ను ఒంటరిగా ఉండనివ్వు. నా జీవితానికి అర్థం శూన్యం. |
17
|
దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి? మనిషికి నీవసలు గుర్తింవు ఎందుకు ఇవ్వాలి? |
18
|
నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు, ప్రతిక్షణం ఎందుకు పరీక్షీస్తావు? |
19
|
దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు? ఒక క్షణమైన నీవు నన్ను, ఒంటరిగా ఉండనియ్యవు? |
20
|
మనుష్యులను గమనించువాడా, నేను పాపం చేశానంటావా, సరే మరి నన్నేం చేయమంటావు? దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు? నేను నీకు ఒక భారమై పోయానా? |
21
|
నీవు నా తప్పిదాలు క్షమించి, నా పాపాలను ఎందుకు క్షమించకూడదు? త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను. అప్పుడు నీవు నాకోసం వెదకుతావు. నేను పోయి ఉంటాను.” |
Job 7:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...