1
|
“ఒక యువతిని కామవాంఛతో చూడ కూడదని నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను. |
2
|
సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడు? దేవుడు ఉన్నతమైన తన పరలోక గృహంలో ఉండి ప్రజలకు తిరిగి ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు? |
3
|
దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపిస్తాడు. తప్పు చేసేవారికి సర్వనాశనం కలిగిస్తాడు. |
4
|
నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు. నేను వేసే ప్రతి అడుగూ ఆయన చూస్తున్నాడు. |
5
|
నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే, లేక ప్రజలకు అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగులెత్తి ఉంటే. |
6
|
అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపుత్రాసు వాడవచ్చును. అప్పుడు నేను నిర్దోషినని దేవునికే తెలుస్తుంది. |
7
|
నేను సరియైన మార్గం నుండి తొలగిపోతే నా కళ్లు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే లేదా నా చేతులు పాపంతో మైలగా ఉంటే, |
8
|
అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని వేయుదురు గాక, నా పంటలు పెరికి వేయబడును గాక. |
9
|
నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే లేదా నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపం చేయటానికి అతని ద్వారం దగ్గర వేచి ఉంటే, |
10
|
అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక. ఇతర వురుషులు ఆమెతో పండుకొందురు గాక. |
11
|
ఎందుకంటే లైంగిక పాపం అవమానకరం. అది శిక్షించబడాల్సిన పాపం. |
12
|
లైంగికపాపం కాల్చివేసి, నాశనంచేసే అగ్నిలాంటిది. లైంగిక పాపంనాకు గల సర్వాన్నీ నాశనం చేస్తుంది. |
13
|
“నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరోధంగా ఆరోపణ చేసినప్పుడు, ఒక వేళ నేను వారికి న్యాయం చేకూర్చేందుకు నిరాకరిస్తే, |
14
|
నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఏమి చేస్త్తాను? నేను చేసిన దాని గూర్చి వివరించు మని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబిస్తాను? |
15
|
దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా సేవకులను కూడా దేవుడే చేసాడు. మమ్ముల్ని ఇద్దరినీ మా తల్లి గర్భంలో దేవుడే రూపొందిచాడు. |
16
|
“పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు. విధవలను దిక్కుమాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు. |
17
|
నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు. అనాధ పిల్లలను నేను ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు. |
18
|
నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. నా జీవిత కాలం అంతా విధవల పట్ల నేను శ్రద్ధ చూపాను. |
19
|
ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు, లేక పేదవాడు చొక్కా లేకుండా ఉన్నప్పుడు, |
20
|
“నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను. వారికి వెచ్చదనం కోసం నా గొర్రెల స్వంతబొచ్చు నేను ఉపయోగించాను. అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించారు. |
21
|
న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ ఒక అనాధ బిడ్డను నేను మోసం చేస్తే, |
22
|
నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా చేయి ఊడి పడిపోవును గాక. నా చేయి దాని కీలు నుండి పడిపోవును గాక. |
23
|
కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు. ఎందుకంటే, దేవుని శిక్షకు నేను భయపడ్డాను. ఆయన మహాత్మ్యము నన్ను బెదరగొట్టేను. |
24
|
“నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు. ‘నీవే నా ఆశ అని’ స్వచ్ఛమైన బంగారంతో నేను ఎన్నడూ చెప్పలేదు. |
25
|
నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండి పోలేదు. లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో మురిసిపోలేదు. |
26
|
నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు. |
27
|
సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు నేను ఎన్నడూ మోసగించబడలేదు. |
28
|
అలాంటిని ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే. ఎందుచేత నంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైన వాడినవుతాను. |
29
|
“నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు నేను ఎన్నడూ సంతోషించలేదు. నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు నేను ఎన్నడూ నవ్వలేదు. |
30
|
నా శత్రువులను శపించటం ద్వారానూ, వారుచావాలని కోరుకోవటం ద్వారానూ, నేను ఎన్నడూ నా నోటితో పాపం చేయలేదు. |
31
|
పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు. |
32
|
పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా నేను అలాంటి వారిని ఎల్లప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను. |
33
|
ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాని నేను నా దొషాన్ని దాచిపెట్టలేదు. |
34
|
ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు. నేను ఎన్నడూ మౌనంగా ఉండలేదు. బయటకు వెళ్లకుండా ఉండలేదు. ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయంనాకు లేదు గనుక. |
35
|
“ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును. ఇప్పుడు నేను నా వాదం చెబుతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు జవాబిచ్చును గాక. నన్ను నిందించే ఆయన, నేను చేశానని నిందించబడుతున్న సంగతులను రాసి పెట్టును గాక. |
36
|
నిశ్చయంగా ఆ రాతను నేను నా భుజం మీద ధరిసాను. నేను దానిని కిరీటంలా ధరిస్తాను. |
37
|
నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను. నేను ఒక అధికారిలా నా తలపైకి ఎత్తుకొని దేవుని దగ్గరకు వస్తాను. |
38
|
నేను సాగుచేస్తున్న భూమిని దాని సొంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే, ఆ భూమిదాని సొంత కన్నీళ్లతో తడిసి ఉంటే, |
39
|
ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే నేను దొంగిలించి ఉంటే, |
40
|
అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!” యోబు మాటలు సమాస్తం. |
Job 31:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...