1
|
అప్పుడు యోబూ ఇలా జవాబు ఇచ్చాడు: |
2
|
“ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను. దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను. |
3
|
దేవునిని ఎక్కడ వెదకాలో ఆయన యెద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ. |
4
|
నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను. నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది. |
5
|
నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలిని కోరుతున్నాను. అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను. |
6
|
దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా? లేదు, ఆయన నా మాట వింటాడు! |
7
|
అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును. అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును. |
8
|
కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు. ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు. |
9
|
దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు. దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు. |
10
|
కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు. ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్త్తాడు. |
11
|
నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను. దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు. |
12
|
దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను. నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం. |
13
|
కానీ దేవుడు ఎన్నటికీ మారడు. ఏ మనిషి ఆయనకు విరొధంగా నిలబడలేడు. దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు. |
14
|
దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడోదాన్ని ఆయన చేస్తాడు. నా కోసం ఆయనకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి. |
15
|
అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా నేను భయపడతాను. వీటన్నింటిని గూర్చీ నేను తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను. |
16
|
దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు. నేనేమో నా ధైర్యం కోల్పోతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భయపెడతాడు. |
17
|
కానీ చీకటి నేను మౌనంగా ఉండేటట్టు చేయదు. గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది. |
Job 23:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...