1
|
అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు: |
2
|
“ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను. మీరు ముగ్గురూ నాకు కష్టమే కలిగిస్తున్నారు కాని ఆదరణకాదు. |
3
|
మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు. మీరెందుకు వాదము కొనసాగిస్తారు? |
4
|
నా కష్టలే మీకు ఉంటే ఇప్పుడు మీరు చెబుతున్న మాటలు నేనూ చెప్పగలను. మీకు విరోధంగా జ్ఞానం గల మాటలు చెప్పి, మిమ్మల్ని చూచి నేను తల ఊపగలను. |
5
|
కాని నేను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను. |
6
|
“అయితే నేను చెప్పేది ఏదీ నా బాధ పోయేట్టుగా చేయలేదు. కానీ నేను మాట్లాడకపోతే నాకు ఆదరణ లేదు. |
7
|
నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు. నా కుటుంబం మొత్తాన్ని నీవు నాశనం చేశావు. |
8
|
నీవు నన్ను కట్టివేశావు. అది ప్రతి ఒక్కరూ చూడగలరు. నా శరీరం రోగంతో ఉంది, నేను భయంకరంగా కనబడుతున్నాను. దాని అర్థం నేను దోషిని అని ప్రజలు తలస్తున్నారు. |
9
|
“దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు, ఆయన నా మీద కోపంగా ఉండి నా శరీరాన్ని చీల్చ వేస్తున్నాడు. దేవుడు నా మీద తన పళ్లు కొరుకుతున్నాడు. నా శత్రువుల కళ్లు ద్వేషంతో చూస్తున్నవి. |
10
|
మనష్యలు నన్ను చూచి నప్వుతారు. వాళ్లంతా నా చుట్టూ చేరి నన్ను అవమానించి నా ముఖం మీద కొట్టడానికి సమ్మతిస్తారు. |
11
|
దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. |
12
|
నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను. కాని దేవుడు నన్ను చితుకగొట్టేశాడు. అవును ఆయన నన్ను మెడపట్టి లాగి, నన్ను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాడు. గురి చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను ప్రయోగిస్తున్నాడు. |
13
|
దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు. నా మూత్రపిండాలలో ఆయన బాణాలు కొడుతున్నాడు. ఆయన దయ చూపించడు. ఆయన నా పైత్య రసాన్ని నేలమీద ఒలక బోస్తాడు. |
14
|
మరల మరల దేవుడు నా మీద దాడి చేస్తాడు. యుద్ధంలో సైనికునిలా ఆయన నా మీదకు పరుగెత్తుతాడు. |
15
|
“నేను (యోబు) చాలా విచారంగా ఉన్నాను, కనుక గోనెపట్టతో చేయబడిన బట్టలు నేను ధరిస్తాను. నేను ఇక్కడ దుమ్ములో, బూడిదలో కూర్చొని ఓడిపోయినట్టుగా భావిస్తున్నాను. |
16
|
ఏడ్బుట మూలంగా నా ముఖం ఎర్రబడింది. ఛాయలు నా కళ్ల చుట్టూరా ఉంగరాల్లా ఉన్నాయి. |
17
|
నేను ఎన్నడూ క్రూరమైన నేరం ఏది చేయలేదు. నా ప్రార్థన నిర్మలమయినది. |
18
|
“భూమీ, నా రక్తాన్ని దాచి పెట్టకు. (నాకు జరిగిన చెడుగులను కప్పి పెట్టకు). న్యాయం కోసం అరిచే నా అరుపులను (ప్రార్థనలను) అగిపోనీయకు. |
19
|
ఇప్పుడు కూడ పరలోకంలో ఎవరో ఒకరు ఉన్నారు. నా పక్షంగా (నా పక్కన) ఉండి నాకు సాక్షిగా ఉన్నాడు. |
20
|
నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు. కాని నా కన్నులు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి. |
21
|
ఒక మనిషి తన స్నేహితుని కోసం బతిమలాడి నట్టుగా, నా కోసం దేవునిని బతిమలాడే ఒక మనిషి నాకు కావాలి. |
22
|
నేను ఏ చోట నుండి (మరణం) తిరిగి రానో ఆ చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే జరగాల్సి ఉంది. |
Job 16:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...