1
|
అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు: |
2
|
“ఎంతకాలం మీరు నన్ను బాధిస్తారు; మాటలతో నన్ను నలుగగొడతారు? |
3
|
ఇప్పటికి మీరు నన్ను పదిసార్లు అవమానించారు. మీరు నా మీద దాడి చేసేటప్పడు ఎలాంటి సిగ్గూ ఉండదు మీకు. |
4
|
ఒకవేళ నేను పాపం చేసినా, అది నా సమస్య అది మిమ్మల్ని బాధించదు. |
5
|
మీరు కేవలం నా కంటే మంచివాళ్లలా చూపించు కోవాలని కోరుతున్నారు. నా కష్టాలకు కారణం నా తప్పు మాత్రమే అని మీరు అంటారు. |
6
|
కానీ నాకు అపకారం చేసినవాడు దేవుడు. ఆయన నన్ను పట్టుకోవటానికి తన వలను నా చుట్టూరా వేశాడు. |
7
|
‘నాకు అపకారం జరిగింది.’ అని నేను కేకలు వేస్తాను. నాకు జవాబు ఏమీ రాదు. సహాయం కోసం నేను గట్టిగా కేకలు వేసినా న్యాయం కోసమైనా నా మొర ఎవరూ వినరు. |
8
|
నేను ముందుకు వెళ్లలేకుండా దేవుడు నా మార్గం మూసివేశాడు. నా తోవను ఆయన చీకట్లో దాచి పెట్టేశాడు. |
9
|
నా ఐశ్వర్యాన్ని దేవుడు తీసివేసుకొన్నాడు. నా తలమీద కిరిటాన్ని ఆయన తీసివేసుకొన్నాడు. |
10
|
నేను చచ్చేంతవరకు నన్ను ఈ పక్క నుండి ఆ పక్కవరకు దేవుడు విరుగగొడతాడు. ఒక చెట్టుదాని వేళ్లతో సహా పెల్లగించబడ్డట్టు ఆయన నా ఆశ తీసివేస్తాడు |
11
|
దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది. ఆయన నన్ను తన శత్రవు అని పిలుస్తున్నాడు. |
12
|
నా మీద దాడి చేసేందుకు దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు. వారు నా చుట్టూరా దుర్గాలు నిర్మిస్తారు. నా గుడారం చుట్టూరా వారు బసచేస్తారు. |
13
|
నా సోదరులు నన్ను ద్వేషించేటట్టు దేవుడు చేశాడు. నా స్నేహితులందరికీ నేను పరాయివాడను. |
14
|
నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు. నా స్నేహితులు నన్ను మరచిపోయారు. |
15
|
నా ఇంట్లో అతిధులు, పనికతైలు నేనేదో పరాయివాడిలా, విదేశీయునిలా నన్ను చూస్తారు. |
16
|
నేను నా సేవకుని పిలిస్తే వాడు జవాబివ్వడు. సహాయం కోసం నేను బతిమలాడినా నా సేవకుడు జవాబు ఇవ్వడు. |
17
|
నా శ్వాస వాసన అంటే నా బార్యకు అసహ్యం. నా స్వంత సోదరులు నన్ను ద్వేషిస్తారు. |
18
|
చిన్న పిల్లలు కూడా నన్ను గేళి చేస్తారు. నేను వాళ్ల దగ్గరకు వస్తే వాళ్లు నాకు విరోధంగా చెడు సంగతులు మాట్లాడుతారు. |
19
|
నాకు సన్నిహితమైన స్నేహితులు అందరూ నన్ను అనహ్యించుకొంటారు. చివరికి నేను ప్రేమించే మనుష్యలు కూడా నాకు విరోధులయ్యారు. |
20
|
“నేను ఎంత సన్నగా ఉన్నానంటే నా ఎముకల మీద నా చర్మం వ్రేలాడుతూ ఉంది. నాలో నాకు కొద్దిపాటి ప్రాణం మాత్రమే మిగిలి ఉంది. |
21
|
“నన్ను దయ చూడండి, నా స్నేహితులారా, నన్ను దయ చూడండి. దేవుని హస్తం నాకు విరోధంగావుంది. |
22
|
దేవుడు చేసినట్టు, మీరు ఎందుకు నన్ను హింసిస్తారు? నన్ను బాధించి మీరెందుకు ఎన్నడూ తృప్తి చెందటం లేదు? |
23
|
“నేను (యోబు) చెప్పేది ఎవరో ఒకరు జ్ఞాపకం ఉంచుకొని, ఒక గ్రంథంలో వ్రాస్తే బాగుంటుందని నా ఆశ. నేను చెప్పే మాటలు ఒక గ్రంథపు చుట్టలో వ్రాయబడాలని నా ఆశ. |
24
|
నేను చెప్పే మాటలు శాశ్వతంగా ఉండేటట్టు సీసంమీద ఇనుప పోగరతో చెక్కబడాలని లేదా ఒక బండమీద వ్రాయబడాలని నా ఆశ. |
25
|
నన్ను ఆదుకొనేవారు ఎవరో ఒకరు ఉన్నారని నాకు తెలుసు. అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు. |
26
|
నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా చర్మం పాడైపోయిన తర్వాత కూడా నేను దేవుణ్ణి చూస్తానని నాకు తెలుసు. |
27
|
నా స్వంత కళ్లతో నేను దేవుణ్ణి చూస్తాను. సాక్షాత్తూ దేవుణ్ణే, ఇంకెవరినీ కాదు. నాలో నా హృదయం బలహీనం అవుతోంది. |
28
|
“ఒకవేళ మీరు, ‘మనం యోబును ఇబ్బంది పెడ్డాం, అతణ్ణి నిందించటానికి ఏదైనా కారణం వెదుకుదాం’ అనుకొవచ్చును. |
29
|
కానీ మీ మట్టుకు మీరే ఖడ్గానికి భయపడాలి. ఎందుకంటే, పాపంమీద దేవుని కోపం శిక్షను రప్పిస్తుంది. మిమ్మల్ని శిక్షించేందుకు యెహోవా ఖడ్గం ప్రయోగిస్తాడు. అప్పుడు తీర్పు ఉంది అని మీరు తెలుసుకొంటారు.” |
Job 19:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...