1
|
ఇవి సొలొమోను సామెతలు (జ్ఞానముగల మాటలు): జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. కాని బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దు:ఖం కలిగిస్తాడు. |
2
|
ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది. |
3
|
యెహోవా మంచి మనుష్యుల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటాడు. వారికి అవసరమైన భోజనాన్ని ఆయన వారికి ఇస్తాడు. కాని దుర్మార్గులకు అవసరమైన వాటిని యెహోవా తొలగించి వేస్తాడు. |
4
|
బద్ధకస్తుడు వేదవాడుగా ఉంటాడు. కాని కష్టపడి పనిచేసేవాడు ధనికుడు అవుతాడు. |
5
|
తెలివిగల వాడు సకాలంలో పంట కూర్చుకొంటాడు. కాని కోత కాలంలో నిద్రపోయేవాడు అవమానము కలిగించే కుమారుడు. |
6
|
మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుని అడుగుతారు. ఆ మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి. |
7
|
మంచి మనుష్యుల కార్యములను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. కాని చెడ్డవారి పేరు మరువ బడును. |
8
|
జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయుమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. |
9
|
నిజాయితీగల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు. కాని మోసం చేసే కపటియైన వ్యక్తి పట్టు బడతాడు. |
10
|
సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు. |
11
|
ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగు పరుస్తాయి. కానీ ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి. |
12
|
ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కానీ మనుష్యులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది. |
13
|
జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. కానీ బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి. |
14
|
జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకొంటారు. కానీ బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు. |
15
|
ధనికుడ్ని ఐశ్వర్యం కాపాడుతుంది. మరియు పేదవాడ్ని పేదరికం పాడు చేస్తుంది. |
16
|
ఒక మనిషి మంచి చేస్తే, అతనికి బహుమానం ఇవ్వబడుతుంది. అతనికి జీవం యివ్వబడుతుంది.దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చి పెడుతుంది. |
17
|
తన శిక్ష మూలంగా నేర్చుకొన్నవాడు ఇతరులు జీవించటానికి సహాయం చేయగలుగుతాడు. అయితే నేర్చుకొనేందుకు అంగీకరించని వాడు మనుష్యులను తప్పు త్రోవలో మాత్రమే నడిపించగలడు. |
18
|
తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు. కానీ బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు. |
19
|
అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుట నేర్చుకొంటాడు. |
20
|
మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కానీ దుర్మార్గుని తలంపులు పనికి మాలినవిగా ఉంటాయి. |
21
|
ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కానీ బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తాయి. |
22
|
యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు. |
23
|
బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కానీ జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు. |
24
|
దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కానీ మంచివాడు తాను కోరుకొనే వాటిని పోందుతాడు. |
25
|
సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుదురు. కానీ మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు. |
26
|
బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు. |
27
|
నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బతుకుతావు. కానీ దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు. |
28
|
మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి. |
29
|
మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. కానీ తప్పుచేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు. |
30
|
మంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు. కానీ దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్లగొట్టబడతారు. |
31
|
మంచి మనుష్యులు జ్ఞానముగల మాటలు చెబుతారు. కానీ కష్టం తెచ్చి పెట్టే వాని మాటలు వినటం మనుష్యులు మానివేస్తారు. |
32
|
మంచి మనుష్యులకు సరైన సంగతులు చెప్పటం తెలుసు. కానీ దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు చెబుతారు. |
Proverbs 10:28 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...