1
|
వస్తువులను సరిగ్గా తూచలేని త్రాసులను కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మనుష్యులను మోసం చేయటానికి వారు ఆ త్రాసులను ఉపయోగిస్తారు. ఆ తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం. కానీ సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం. |
2
|
గర్వించి, గొప్పలు చెప్పుకొనే మనుష్యులు ఎన్నిక లేని వారవుతారు. కానీ దీనులు జ్ఞానముగల వారవుతారు. |
3
|
మంచి, నిజాయితీగల మనుష్యులు నిజాయితీ పంథాను అనుసరిస్తారు. కానీ దుర్మార్గులు ఇతరులను మోసం చేసినప్పుడు వారిని వారే నాశనం చేసుకొంటారు. |
4
|
దేవుడు మనుష్యులకు తీర్చు తీర్చేనాడు, డబ్బుకి విలువ ఏమీ ఉండదు. కానీ మంచితనం మనుష్యులను మరణం నుండి రక్షిస్తుంది. |
5
|
ఒక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే, అతని జీవితం సులభంగా ఉంటుంది. కానీ దుర్మార్గుడు అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయ బడతాడు. |
6
|
నిజాయితీగల మనిషిని మంచితనం రక్షిస్తుంది. కానీ దుర్మార్గులు వారు చేయాలనుకొన్న చెడు విషయాల ఉచ్చులో పట్టుబడతారు. |
7
|
దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతనికి నిరీక్షణ ఏమీలేదు. అతడు ఆశించినది అంతా పోతుంది అదంతా మొత్తం ఏ విలువలేనిది అవుతుంది. |
8
|
మంచి మనిషి కష్టాన్ని తప్పించుకొంటాడు. ఆ కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది. |
9
|
ఒక దుర్మార్గుడు చప్పే విషయాల మూలంగా అతడు ఇతరులను బాధించగలడు. కానీ మంచి మనుష్యులు వారి జ్ఞానము చేత కాపాడబడుతారు. |
10
|
మంచి మనుష్యులకు విజయం కలిగినప్పుడు పట్టణం అంతా సంతోషిస్తుంది. దుర్మార్గులు నాశనం చేయబడినప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు. |
11
|
నిజాయితీగల మనుష్యులు వారు నివసిస్తున్న పట్టణానికి తమ దీవెనలు ఇచ్చినప్పుడు, అది గొప్పది అవుతుంది. కానీ ఒక దుర్మార్గుడు చెప్పే విషయాలు ఒక పట్టణాన్ని నాశనం చేయగలవు. |
12
|
బుద్ధిహీనుడు ఇతరులను విమర్శిస్తాడు. అయితే జ్ఞానముగలవానికి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు. |
13
|
ఇతరులను గూర్చి రహస్యాలు చెప్పే వారెవరూ నమ్మదగినవారు కారు. కానీ నమ్మదగిన మనిషి చెప్పు మాటలను వ్యాపింపచేయడు. |
14
|
ఒక దేశానికి సమర్ధత లేని నాయకులు ఉంటే, ఆ దేశం పతనం అవుతుంది. అయితే అనేకమంది మంచి సలహాదారులు ఆ దేశాన్ని క్షేమంగా ఉంచుతారు. |
15
|
ఇంకో మనిషి బాకీ నీవు చెల్లిస్తానని వాగ్దానం చేస్తే, అప్పుడు నీవు విచారిస్తావు. అలాంటి వ్యవహారాలను నీవు తిరస్కరిస్తే నీవు క్షేమంగా ఉంటావు. |
16
|
దయగల, మర్యాదస్థురాలు గౌరవం సంపాదిస్తుంది. చొచ్చుకుపోయే పురుషులు ధనం మాత్రమే సంపాదిస్తారు. |
17
|
దయగల మనిషి లాభం పొందుతాడు.కానీ నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. |
18
|
దుర్మార్గుడు మనుష్యులను మోసం చేసి, వారి డబ్బు తీసుకొంటాడు. అయితే న్యాయంగా ఉండి, సరైనది చేసేవాడు నిజమైన బహుమానం పొందుతాడు. |
19
|
నిజంగా, మంచితనం జీవాన్ని తెచ్చిపెడ్తుంది. కానీ దుర్మార్గులు దుర్మార్గాన్ని వెంటాడి, మరణం తెచ్చుకొంటారు. |
20
|
దుర్మార్గం చేయటానికి ఇష్టపడే వాళ్లు యెహోవాకు అసహ్యం. అయితే మంచిని చేసేందుకు ప్రయత్నించే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం. |
21
|
దుర్మార్గులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది సత్యం. మంచివాళ్లు స్వతంత్రులుగా చేయబడతారు. |
22
|
ఒక స్త్రీ అందంగా ఉండి, అవివేకంగా ఉంటే అది అందమైన బంగారు ఉంగరం పంది ముక్కుకు ఉన్నట్టే ఉంటుంది. |
23
|
మంచి మనుష్యులకు వారు కోరిందిలభించి నప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే ఉంటుంది. కానీ దుర్మార్గులకు వారు కోరింది లభించినప్పుడు, చివరికి అది చిక్కుగానే ఉంటుంది. |
24
|
ఒక మనిషి ధారాళంగా ఇస్తే, అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ లభిస్తుంది. కాని ఒకడు ఇచ్చేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు దరిద్రుడు అవుతాడు. |
25
|
ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పోందుతాడు. నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది . |
26
|
తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశగల మనిషి మీద ప్రజలు కోపగిస్తారు. అయితే ఇతరులకు ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విషయంలో ప్రజలు సంతోషిస్తారు. |
27
|
మంచిని చేయుటకు ప్రయత్నించే మనిషిని ప్రజలు గౌరవిస్తారు. కాని దుర్మార్గం చేసే మనిషికి కష్టం మాత్రమే వస్తుంది. |
28
|
తన ఐశ్వర్యాలను నమ్ముకొనే మనిషి పడిపోతాడు.కాని, మంచి మనిషి పచ్చటి చిగురాకులా పెరుగుతాడు. |
29
|
ఒక మనిషి గనుక తన కుటుంబానికి కష్టం కలిగిస్తే అతనికి లాభం ఏమీ కలుగదు. చివరికి బుద్ధిహీనుడు జ్ఞానముగల మనిషికి సేవ చేయుటకు బలవంతం చేయబడతాడు. |
30
|
మంచి మనిషి చేసే విషయాలు జీవవృక్షంలా ఉంటాయి. ఒక జ్ఞానముగల మనిషి ప్రజలకు కొత్త జీవితం ఇస్తాడు. |
31
|
మంచి మనుష్యులకు భూమి మీద ప్రతిఫలం ఇవ్వబడితే, నిశ్చయంగా దుర్మార్గులు, పాపులు వారికి తగిన దానిని పోందుతారు. |
Proverbs 11:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...