Indian Language Bible Word Collections
Job 8:18
Job Chapters
Job 8 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Job Chapters
Job 8 Verses
1
|
అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు: |
2
|
“ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు? నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి. |
3
|
దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు. సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వ శక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు. |
4
|
నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు. వారు వారి పాపాలకు వెల చెల్లించారు. |
5
|
అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు. ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు. |
6
|
నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు. |
7
|
నీకు మొదట ఉన్నదానికంటె ఎక్కువగా వస్తుంది. |
8
|
వబూ వృద్ధులను అడిగి వారుతమ పూర్వీకుల నుండి ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో. |
9
|
ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక. మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి. |
10
|
చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు. వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.” |
11
|
బిల్దదు చెప్పాడు,”ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా? |
12
|
లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి. వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి. |
13
|
దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు. దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు. |
14
|
ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది. ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది. |
15
|
ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా ఆ గూడు తెగిపోతుంది. అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు. |
16
|
సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు. ఆ మొక్క కొమ్ములు తోట అంతటా వ్యాపిస్తాయి. |
17
|
అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది. |
18
|
కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడి నప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు.’నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడ లేదు’ అని ఆ తోట అంటుంది. |
19
|
కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే. తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి. |
20
|
నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు. చెడ్డ మనుష్యలకు ఆయన సహాయం చేయడు. |
21
|
అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను, నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు. |
22
|
కానీ నీ శత్రవులను దేవుడు సిగ్గుపరుస్తాడు. దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు. |