English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Job Chapters

Job 38 Verses

1 అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు జవాబు ఇచ్చాడు. దేవుడు చెప్పాడు:
2 “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన, తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే ఈ మనిషి ఎవరు?
3 యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు. నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగాఉండు.
4 “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.
5 యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు? నీకు తెలిసినట్టే ఉంది! కొల బద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు.
6 భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి? భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు?
7 అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసిపాడాయి. దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.
8 “యోబూ, భూమి అగాధములో నుండి సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు?
9 ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను. మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను.
10 సముద్రానికి హద్దులు నేనే నియమించాను. మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను.
11 నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు. నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను.
12 “యోబూ, ప్రారంభం కావాలని ఉదయంతోను, ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో నీవు ఎప్పుడైనా చెప్పావా?
13 యోబూ, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని, దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా?
14 ఉదయపు వెలుగు కొండలు, లోయలు కనబడేటట్టు చేస్తుంది. పగటి వెలుగు భూమి మీదికి వచ్చినప్పుడు ఆ స్థలాల ఆకారాలు చోక్కా మడతల్లా తేటగా కనబడతాయి. అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా ఆ స్థలాలు ఆకారాలు రూపొందు తాయి.
15 దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది.
16 “యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావా? మహా సముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా?
17 యోబూ, మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే ద్వారాలను ఎవరైనా, ఎన్నడయినా నీకు చూపించారా?
18 యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు గ్రహిస్తున్నావా? ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు.
19 “యోబూ, వెలుగు వచ్చే దిశగా పోయేందుకు ఎటు వెళ్లాలి? చీకటి ఎక్కడ నుండి వస్తుంది?
20 యోబూ, చీకటి వెలుగు ఎక్కడ నుండి వస్తాయో అక్కడికి వాటిని నీవు తీసుకొని వెళ్లగలవా? అవి నివసించే చోటుకు ఎటుగా వెళ్లాలో నీకు తెలుసా?
21 యోబూ, నీవు చాలా ముసలివాడిని కదా? భూమి చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా తెలుసు. నీవు లేవూ?
22 “యోబూ, నేను హిమమును, వడగండ్లను నిలువ ఉంచే గిడ్డంగులకు నీవు ఎప్పుడైనా వెళ్లావా?
23 కష్టదినాల్లో ఉపయోగించేందుకు యుద్ధాన్ని, పోరాట దినాలకు ఉపయోగించేందుకు హిమమును, వడగండ్లను నేను దాచిపెడతాను.
24 యోబూ, సూర్యుడు ఎక్కడ నుండి పైకి వస్తాడో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా? భూమి అంతటా వీచేందుకు తూర్పు గాలులు ఎక్కడనుండి వస్తాయో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా?
25 యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని ఎవరు తవ్వారు? ఉరుములోని మెరుపుకు మార్గం ఎవరు చేశారు?
26 యోబూ, మనుష్యులు ఎవరూ నివసించని చోట నీళ్లు ఉండునట్లు.
27 బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమైన గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి, ఈ సంగతులను చేసిన వారు ఎవరు?
28 యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులు ఎక్కడ నుండి వస్తాయి?
29 యోబూ, హిమమునకు తల్లి ఎవరు? ఆకాశంనుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు?
30 జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి?
31 “యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా? మృగశీర్షకు కట్లు నీవు విప్పగలవా?
32 యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో సమకూడునట్టు నీవు చేయగలవా? లేక ఎలుగుబంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా?
33 యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు తెలియునా? భూమి మీద వాటి పాలనను నీవు ప్రారంభించగలవా?
34 “యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా?
35 యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా? మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’ అని అంటాయా?
36 “ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు? మనస్సుకు గ్రహింపును ఇచ్చేది ఎవరు?
37 యోబూ, మేఘాలను లెక్కించుటకు, అవి వాటి వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చుటకు అంతటి తెలివిగలవారు ఎవరు?
38 ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది. ఆ మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి.
39 “యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా? ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా?
40 అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో పండుకొని లేక కూర్చొని ఉంటాయి.
41 యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు కాకులను పోషించేది ఎవరు?
×

Alert

×