1
|
నా ఆత్మ భగ్నమై పోయింది. విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం. నా జీవితం దాదాపు గతించిపోయింది, సమాధి నాకోసం నిరీక్షిస్తోంది. |
2
|
మనుష్యలు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి నవ్వుతున్నారు. వారు నన్ను ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటే నేను వారిని గమనిస్తున్నాను. |
3
|
“దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు, మరి ఎవ్వరూ నన్ను బలపరచరు. |
4
|
నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు, కనుక వారు నన్ను అర్థం చేసుకోరు. దయచేసి వారిని జయించనీయకు. |
5
|
‘ఒకడు తన స్వంత పిల్లలను నిర్లక్ష్యం చేసి తన స్నేహితులకు సహాయం చేస్తాడు అని ప్రజలు చెబుతారని నీకు తెలుసా? కాని ఇప్పుడు నా స్నేహితులే నాకు విరోధం అయ్యారు. |
6
|
దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ పదంగా చేశాడు. ప్రజలు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు. |
7
|
నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి. నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా సన్నం అయ్యింది. |
8
|
మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడు తున్నారు. దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల విషయమై నిర్దోషులు కలవర పడుతున్నారు. |
9
|
కాని నీతీమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు. నిర్దోషులు మరింత బలవంతులపుతారు. |
10
|
“కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం చేయండి. మీలో ఎవరూ జ్ఞానం గల వారుకారు. |
11
|
నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి. నా ఆశ అడుగంటింది. |
12
|
కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు. చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు అంటారు. |
13
|
నేను కనిపెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం అయితే, అంధకార సమాధిలో నేను నా పడక వేసుకొంటే |
14
|
సమాధిని చూచి, ‘నీవు నా తండ్రివి అని’ పురుగులను చూసి, ‘నా తల్లివి’ లేక ‘నా సోదరివి’ అని నేను చెప్పవచ్చు |
15
|
కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు. మరియు ప్రజలు నాయందు ఏ ఆశ చూడలేరు. |
16
|
(నా ఆశ నాతోనే చనిపోతుందా?) అది నేను చని పోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా? మన మంతా చేరి బురదలోకి వెళ్తామా?” |
Job 17:14 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...