1
|
“నా స్వంత జీవితం నాకు అసహ్యం. అందు చేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను. నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు నేను మాట్లాడతాను. |
2
|
నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు. నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం? |
3
|
దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం నీకు సంతోషమా? చూస్తుంటే, నీవు చేసిన దాని గూర్చి నీకు శ్రద్ధ లేనట్లుంది. దుర్మార్గులు వేసే పథకాలకు నీవు సంతోషిస్తున్నావా? |
4
|
దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా? మనుష్యులు చూసినట్టుగా నీవు సంగతులు చూస్తున్నావా? |
5
|
మా రోజుల్లాగ మీవి కొద్దిపాటి రోజులా? మా సంవత్సరాల్లా మీవి కొన్ని సంవత్సరాలేనా? |
6
|
నీవు నా తప్పుకోసం చూస్తూ నాపాపం కోసం వెదకుతున్నావు. |
7
|
కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు. అయితే నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు! |
8
|
దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి. కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు. |
9
|
దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో. కానీ, నీవు ఇప్పుడు నన్ను మరల మట్టిగా ఎందుకు మారుస్తున్నావు? |
10
|
పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను సోస్తున్నావు. నన్ను వెన్న చిలకరించినట్లుగా చేస్తున్నావు. |
11
|
ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు. తర్వాత చర్మంతో, మాంసంతో నీవు నన్ను కప్పివేశావు. |
12
|
నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు. నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు. నా ఆత్మను కాపాడావు. |
13
|
కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది ఇదేనని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదేనని నాకు తెలుసు. |
14
|
ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని నీవు నన్ను గమనిస్తూ ఉంటావు. |
15
|
నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని. అది నాకు చాలా చెడు అవుతుంది. కానీ నేను నిర్దోషిని అయినా సరే, నేను నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే, నేను సిగ్గుతో, బాధతో నిండిపోయాను గనుక. |
16
|
ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతావు. నీవు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు. |
17
|
నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు నీకు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. నామీద నీ కోపం ఎక్కువ అవుతుంది. నీవు నా మీదికి కొత్త సైన్యాలను పంపిస్తావు. |
18
|
అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు పుట్టనిచ్చావు? నన్ను ఎవరూ చూడక ముందే నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది. |
19
|
నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే బాగుండును. నేను నా తల్లి గర్భం నుండి తిన్నగా సమాధికి మోసికొనిపోబడితే ఎంత బాగుండేది.? |
20
|
నా జీవితం దాదాపు అయిపోయింది. కనుక నన్ను ఒంటరిగా వదిలెయ్యి. ఏదో కొద్దిపాటి వసతుల్ని అనుభవించనివ్వు. |
21
|
ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో, అంధకారం, మరణం ఉండే ఆ చోటుకు నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది సమయం నన్ను అనుభవించనివ్వు. |
22
|
ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందరగోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభవించ నివ్వు. అక్కడ వెలుగు కూడా చీకటిగా ఉండి ఉంటుంది.” |
Job 10:17 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...