Indian Language Bible Word Collections
Job 37:24
Job Chapters
Job 37 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Job Chapters
Job 37 Verses
1
“ఉరుములు, మెరుపులు నన్ను భయపెడతాయి. నేను ఈ విషయాలు తలచినప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకొంటుంది.
2
ప్రతి ఒక్కరూ వినండి. దేవుని స్వరం ఉరుములా ధ్వనిస్తుంది. దేవుని నోటి నుండి వస్తోన్న ఉరుముశబ్దం వినండి
3
మొత్తం ఆకాశం అంతటా వెలిగేలా దేవుడు తన మెరుపును పంపిస్తాడు. అది భూమి అంతట మెరిసింది.
4
మెరుపు మెరిసిన తర్వాత గర్జించే దేవుని స్వరం వినవచ్చును. దేవుడు తన ఆశ్చర్యకరమైన స్వరంతో ఉరుముతాడు. మెరుపు మెరుస్తూ ఉండగా దేవుని స్వరం ఉరుముతుంది.
5
దేవుడు ఉరిమే స్వరం అద్భుతం. మనం గ్రహించజాలని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.
6
‘నేలమీద పడు’ అని ఆయన మంచుతో చెబుతాడు. ‘నేలమీద వర్షించు’ అని దేవుడు వర్షంతో చెబుతాడు.
7
దేవుడు ఏమి చేయగలడో అనేది అయన సృజించిన మనుష్యులంతా తెలుసుకొనేందుకు అలా చేస్తాడు.
8
మృగాలు వాటి గుహల్లోకి పరుగెత్తిపోయి, అక్కడ నివసిస్తాయి.
9
తుఫాను దక్షిణం నుండి వస్తుంది. చలి ఉత్తరం నుండి వస్తుంది.
10
దేవుని ఊపిరి మంచును చేస్తుంది. అది మహాసముద్రాలను గడ్డ కట్టిస్తుంది
11
దేవుడు మేఘాలను నీళ్లతో నింపుతాడు. ఆయన తన మెరుపును మేఘాల ద్వారా విస్తరింప చేస్తాడు.
12
భూమి మీద అంతటికీ చెదరిపోయేలా దేవుడు మేఘాలను ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏమి చెబితే అది మేఘాలు చేస్తాయి.
13
దేవుడు మనుష్యులను శిక్షించేందుకు, వరదలను లేదా తన ప్రేమ చూపుటకై వర్షం రప్పించేందుకు మేఘాలను తీసుకొని వస్తాడు.
14
“యోబూ, ఒక నిమిషం ఆగి విను. ఆగి, దేవుడు చేసే అద్భుత విషయాలను గూర్చి ఆలోచించు.
15
యోబూ, దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తాడో నీకు తెలుసా? దేవుడు తన మెరుపును ఎలా ప్రకాశింప చేస్తాడో నీకు తెలుసా?
16
ఆకాశంలో మేఘాలు ఎలా వేలాడుతాయో నీకు తెలుసా? దేవుని జ్ఞానం పరిపూర్ణం. మేఘాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు.
17
లేదు, యోబూ, ఈ సంగతులు నీకు తెలియపు. దక్షిణపు వేడి గాలిలో భూమి నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు చెమటపోసి, నీ బట్టలు జిడ్డుగా ఉండటం మాత్రమే నీకు తెలుసు.
18
యోబూ, ఆకాశాన్ని విశాలపరచేందుకు మెరుగుదిద్దిన అద్దంలా దానిని గట్టిగా చేసేందుకు నీవు దేవునికి సహాయం చేయగలవా?
19
“యోబూ, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు. మేము చీకటిలో ఉన్నందువల్ల సరియైన మా వాగ్వివాదాన్ని దేవునికి మేము చెప్పలే కున్నాము. (దేవుని సన్నిధిలో) ఏమి చెప్పడానికీ మాకు తెలియడంలేదు.
20
నేను దేవునితో మాట్లాడాలని నేను ఆయనతో చెప్పను. అలా చెప్పటం నాశనం చేయమని అడిగినట్టే ఉంటుంది.
21
ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి ఏ మనిషీ చూడలేడు. గాలి మేఘాలను తరిమి వేసిన తరువాత అది ఆకాశంలో చాలా తేజోవంతంగా ప్రకాశిస్తుంది.
22
(అదే విధంగా దేవుడు ఉన్నాడు) దేవుని బంగారు మహిమ ఉత్తరం నుండి ప్రకాశిస్తుంది. దేవుడు అద్భుత మహిమతో వస్తాడు.
23
సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా గొప్పవాడు. మనం దేవుని దగ్గరగా వెళ్లలేం. దేవుడు మనుష్యుల్ని ఎల్లప్పుడూ సరిగ్గాను, న్యాయంగాను చూస్తాడు.
24
అందువల్లనే మనుష్యులు దేవుని గౌరవిస్తారు. కానీ తెలివిగల వాళ్లం అనుకొనే గర్విష్ఠులను దేవుడు లక్ష్యపెట్టడు.”