1
|
అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు యిచ్చాడు: |
2
|
“దేవునికి నరుడు ఉపకారికాగలడా? జ్ఞానం గల వ్యక్తి తప్పక తనకు తానే ఉపయోగికారిగా వుంటాడు. |
3
|
ఒకవేళ నీవు సక్రమమయినదే చేసినప్పటికీ, సర్వ శక్తిమంతుడైన దేవునికి అది సంతోషం కలిగించదు. నీవు ఎల్లప్పుడూ మంచివాడివిగానే వున్నా దేవునికి ఏమీ లాభంలేదు. |
4
|
యోబూ, దేవుడు నిన్ను శిక్షించినది ఆయనను నీవు ఆరాధించినందుకా? |
5
|
కాదు, అది నీవు విస్తారంగా పాపం చేసినందువల్లనే. యోబూ, నీ పాపాలు ఎప్పటికీ నిలిచిపోవు. |
6
|
యోబూ, నీ సోదరులు నీకు ఋణపడి ఉన్న ధనాన్ని నీకు తిరిగి చెల్లించేందుకు నీవు వారిని బలవంతం చేశావు. అది కారణం లేకుండా నీవు చేశావు. ప్రజల దగ్గర్నుండి వస్తాలు నీవు లాగేసు కొని, వారు ధరించటానికి ఏమీ లేకుండా చేశావు. |
7
|
అలసిపోయిన మనుష్యలకు నీవు నీళ్లు ఇవ్వలేదు. ఆకలిగొన్న మనుష్యలకు నీవు అన్నం పెట్టలేదు. |
8
|
యోబూ! నీవు అధికారం, ఐశ్వర్యం గలవాడవై నప్పటికీ నీవు ఆ ప్రజలకు సహాయం చేయలేదు. నీకు చాలా భూమి ఉంది, నీవు చాలా గౌరవం పొందినవాడవు. |
9
|
కాని విధవలకు నీవు ఏమీ ఇవ్వకుండానే వారిని పంపించివేశావు. యోబూ! అనాధ పిల్లలను నీవు దోచుకొని నీవు వారి యెడల చెడుగా ప్రవర్తించావు. |
10
|
అందుకే నీ చుట్టూరా బోనులు ఉన్నాయి. మరియు ఆకస్మిక కష్టం నిన్ను భయ పెడుతుంది. |
11
|
అందుకే నీవు చూడలేనంత కటిక చీకటిగా ఉంది. మరియు అందుకే నీళ్ల ప్రవాహం నిన్ను కప్పేస్తుంది. |
12
|
ఆకాశంలో అతి ఉన్నత స్థానంలో దేవుడు నివసిస్తాడు. మహా ఎత్తయిన నక్షత్రాలను దేవుడు వంగి కిందికి చూస్తాడు. నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీవు చూడగలవు. |
13
|
కాని యోబూ, ‘నీవు దేవునికి ఏమీ తెలియదు! అంధకార మేఘాల్లోంచి దేవుడు మాకు ఎలా తీర్పు తీరుస్తాడు? |
14
|
ఆయన ఆకాశపు అత్యున్నత స్థానంలో నడిచేటప్పుడు మనం చూడకుండా మేఘాలు ఆయనను కప్పివేస్తాయి. ‘ అని అంటావు. |
15
|
“ యోబూ! దుర్మార్గులు తిరిగే పాత మార్గంలోనే నీవు నడుస్తున్నావు. |
16
|
దుర్మార్గులు మరణించాల్సిన సమయం రాకముందేవారు తీసుకోబడ్డారు. ఒక వరదలో వారు కొట్టుకొని పోయారు. |
17
|
‘మమ్ముల్ని ఒంటరిగా విడిచిపెట్టండి. సర్వశక్తి మంతడైన దేవుడు మమ్ముల్ని ఏమీ చేయలేడు’అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే. |
18
|
కానీ ఆ మనుష్యలనే దేవుడు విజయం పొందిన ధనికులుగా చేశాడు. దుర్మార్గులు తలచే పద్ధతి నేను అంగీకరించలేను. |
19
|
దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు చూచి సంతోషిస్తారు. నిర్దోషులు దుర్మార్గులను చూచి నవ్వుతూ. |
20
|
‘మన శత్రువులు నిజంగా నాశనం చేయబడ్డారు. వారి ఐశ్వర్యాలను అగ్ని కాల్చేస్తుంది’ అని అంటారు. |
21
|
“యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది. ఇలా నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందుతావు. |
22
|
ఈ ఉపదేశము స్వీకరించి ఆయన మాటలు నీ హృదయంలో భద్రం చేసికో. |
23
|
యోబూ! సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నీవు తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వబడుతుంది. నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటినుండి దూరంగా తొలగించి వేయాలి. |
24
|
నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి, ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు. |
25
|
సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు బంగారంగాను, వెండిగాను ఉండనియ్యి. |
26
|
అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తి మంతుడైన దేవునిలో ఆనందం కనుగొంటావు. నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు. |
27
|
నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. నీవు ఏం చేస్తానని ఆయనకు ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు. |
28
|
నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు. నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది |
29
|
గర్విష్ఠులను దేవుడు సిగ్గు పరుస్తాడు కానీ దీనులను దేవుడు రక్షిస్తాడు. |
30
|
నిర్దోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు. నీ చేతుల పవిత్రత మూలంగా అతడు రక్షించ బడతాడు.” |
Job 22:20 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...