1
|
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: |
2
|
“నేను చెప్పేది వినండి. మీరు వినటమే మీరు నాకు ఇచ్చే ఆదరణ. |
3
|
నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి. ఆ తర్వాత నేను మాట్లాడటం ముగించాక మీరు నన్ను గేళి చేయవచ్చు. |
4
|
“నేను మనుష్యుల మీద ఆరోపణ చేయటం లేదు. నేను ఓపికగా ఉండకపోవటానికి ఒక మంచి కారణం ఉంది. |
5
|
నన్ను చూచి, అదరిపొండి. మీ నోటిమీద చేయి పెట్టుకొని అదురుతో నన్ను అలానే తేరి చూడండి. |
6
|
నాకు సంభవించిన దానిని గూర్చి తలచినప్పుడు నేను భయపడతాను, నా శరీరం వణకుతుంది. |
7
|
దుర్మార్గులు చాలాకాలం బతుకుతారెందుకు? వారు ముసలివాళ్లవ్వటం, విజయం పొందటం ఎందుకు? |
8
|
దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం చూస్తారు. దుర్మార్గులు వారి మనుమలు, మనుమ రాండ్రను చూసేంత వరకు బతుకుతారు. |
9
|
వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం లేదు. దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు తన దండం ఉపయోగించడు. |
10
|
వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు. వారి ఆవులకు దూడలు ఉన్నాయి. ఆ దూడలు పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు. |
11
|
దుర్మార్గులు వారి పిల్లలు ఆడుకొనేందుకు గొర్రె పిల్లల్లా బయటకు పంపిస్తారు. వారి పిల్లలు గంతులు వేస్తారు. |
12
|
స్వరమండలాలు, పిల్లనగ్రోవుల ధ్వనులతోబాటు వారి పిల్లలు పాడుతూ, నాట్యం చేస్తారు. |
13
|
దుర్మార్గులు వారి జీవితకాలంలో విజయం అనుభవిస్తారు. అనగా వారు మరణించి, శ్రమ అనుభవించకుండానే తమ సమాధికి వెళ్తారు. |
14
|
కానీ దుర్మార్గులు, దేవునితో ఇలా చెబుతారు, ‘మమ్మల్ని ఇలా విడిచిపెట్టండి, మేము ఏమి చేయాలని మీరు కోరుతారో అది మాకు లెక్కలేదు’ అంటారు. |
15
|
మరియు దుర్మార్గులు, ‘సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు? మేము ఆయనను సేవించాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రార్థన చేసిన లాభం లేదు’ అంటారు. |
16
|
దుర్మార్గులు తమ మూలంగానే వారికి విజయం కలుగుతుందని తలస్తారు. కానీ నేను వారి తలంపును అంగీకరించను. |
17
|
అయితే దుర్మార్గులు దీపం ఆర్పివేయబడటం అనేది, ఎంత తరచుగా జరుగుతుంది? దుర్మార్గులకు ఎన్నిసార్లు కష్టం వస్తుంది? దేవుడు వారి మీద కోపగించి వారిని శిక్షిస్తాడా? |
18
|
గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గావి ఊకను ఎగురగొట్టినట్లు దేవుడు దుర్మార్గులను ఎగుర గొట్టి వేస్తాడా? |
19
|
‘తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమారుణ్ణి శిక్షిస్తాడు’ అని మీరంటారు. కాదు! ఆ దుర్మార్గుడినే దేవుడు శిక్షించనివ్వండి. అప్పుడు ఆ దుర్మార్గుడు తన స్వంత పాపాల కోసమే శిక్షించబడుతున్నట్టు అతనికి తెలుస్తుంది. |
20
|
పాపి తన స్వంత శిక్షను చూడాలి. సర్వశక్తిమంతుడైన దేవుని కోపాన్ని అతడు అనుభవిస్తాడు. |
21
|
దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు చనిపోయినప్పుడు అతడు విడిచిపెడుతున్న తన కుటుంబం విషయమై అతడు లెక్కచేయడు. |
22
|
“దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు. ఉన్నత స్థానాల్లో ఉండే మనుష్యులకు కూడ దేవుడు తీర్పు తీరుస్తాడు. |
23
|
ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు. అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న జీవితం జీవించాడు. |
24
|
అతని శరీరం బాగా పోషించబడింది, అతని ఎముకలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి |
25
|
అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు. అతడు మంచిది ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు. |
26
|
వీళ్లద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని ఉంటారు. వాళ్లిద్దర్నీ పురుగులు పట్టేస్తాయి. |
27
|
“కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మరియు మీరు నాకు అపకారం చేయాలని తలపెడుతున్నారని నాకు తెలుసు. |
28
|
యువరాజు ఇల్లు ఎక్కడ?’ దుర్మార్గుడు నివసించిన ఆ ఇల్లు ఏది?, అని మీరు అంటారు. |
29
|
కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు ఎన్నడూ అడగలేదు. వారి కథలను మీరు అంగీ కరించనూ లేదు. |
30
|
విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్ట బడుతారు. ఏ రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో ఆ రోజు వాళ్లు రక్షింపబడతారు. |
31
|
దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని ముఖంమీదే అతణ్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ లేడు. అతడు చేసిన కీడుకు అతనిని ఎవ్వరూ శిక్షించరు. |
32
|
దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు. |
33
|
ఆ దుర్మార్గునికి లోయలోని మట్టి తియ్యగా ఉంటుంది. వాని చావు ఊరేగింపులో వేలాది మంది ఉంటారు. |
34
|
అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు. మీ జవాబులు ఇంకా అబద్ధాలే!” |
Job 21:11 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...