1
|
యోబు ఇలా అన్నాడు: “ఇదంతా ఇదివరకే నా కళ్లు చూశాయి. మీరు చెప్పేది అంతా నేను ఇదివరకే విన్నాను. అదంతా నేను గ్రహించాను. |
2
|
మీకు తెలిసింది అంతా నాకు తెలుసు. నేను మీకంటే తక్కువ కాదు. |
3
|
కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు) సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలిని నేను కోరు తున్నాను. నా కష్టాల గూర్చి నేను దేవునితో వాదించాలని కోరుతున్నాను. |
4
|
కానీ, మీరు ముగ్గురూ మీ అజ్ఞానాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరినీ బాగుచేయలేని పనికిమాలిన వైద్యుల్లా మీరు ఉన్నారు. |
5
|
మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది. అది మీరు చేయగలిగిన అతి జ్ఞానంగల పని. |
6
|
“ఇప్పుడు, నా వాదం వినండి. నేను నా విన్నపం చెబుతుండగా, వినండి |
7
|
మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా? మీరు చెప్పాలని దేవుడు కోరుతున్నవి మీరు చెప్పు తున్నవి అబద్ధాలే అని మీరు నిజంగా నమ్ము చున్నారా? |
8
|
మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా? న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా? |
9
|
దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఆయనకు మంచి ఏమైనా కనబడుతుందా? మీరు మనుష్యులను మోసం చేసినట్టే దేవునిని కూడా మోసం చేయగలమని నిజంగా అనుకొంటున్నారా? |
10
|
మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని రహస్యంగా నిర్ణయిస్తే దేవుడు విజంగా మిమ్మల్ని గద్దిస్తాడు. |
11
|
దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుది. ఆయన్ను చూచి మీరు భయపడతారు. |
12
|
(మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడు తున్నాం అనుకొంటారు). కానీ మీ మాటలు బూడిదలా పనికిమాలినవే. మీ వాదాలు మట్టిలా బలహీనమైనవే. |
13
|
నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి. అప్పుడు నాకు ఏం జరగాల్సి ఉందో అది జరగ నివ్వండి. |
14
|
నాకు నేను అపాయంలో చిక్కుకొనుచున్నాను, నా ప్రాణం నా చేతుల్లోకి తీసుకొంటున్నాను. |
15
|
దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ముతూనే వుంటాను. ముఖాముఖిగా, ఆయన ముందు నా విధానాలను రుజువు చేస్తాను. |
16
|
కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో. చెడ్డ మనిషీ ఎవ్వరూ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసు కోడానికి సాహసించరు. |
17
|
నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వివరిస్తూండగా నీ చెవులను విననివ్వవు. |
18
|
ఇప్పుడు నన్ను నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను జాగ్రత్తగా నా వాదనలను మీ ముందు ఉంచుతాను. నాదే సరి అని నాకు చూపించబడుతుంది అని నాకు తెలుసు. |
19
|
నాది తప్పు అని ఏ మనిషీ రుజువు చేయలేడు. అలా ఎవరైనా చేయగలిగితే నేను మౌనంగా ఉండి మరణిస్తాను. |
20
|
“దేవా, కేవలం రెండు సంగతులు నాకు దయ చేయుము. అప్పుడు నేను నీవద్ద దాగుకొనను. |
21
|
నన్ను శిక్షించడము ఆపివేయి. నీ భయాలతో నన్ను బెదిరించకు. |
22
|
అప్పుడు నన్ను పిలువు, అప్పుడు నేను నీకు జవాబు ఇస్తాను. లేదా నన్ను నీతో మాట్లాడనివ్వు. నీవు నాకు జవాబు ఇవ్వు. |
23
|
నేను ఎన్ని పాపాలు చేశాను? నేను ఏం తప్పు చేశాను? నా పాపాలు, నా తప్పులు నాకు చూపించు. |
24
|
దేవా, నీవు నన్ను ఎందుకు తప్పిస్తున్నావు? నన్ను నీ శత్రువులా ఎందుకు చూస్తూన్నావు? |
25
|
నీవు నన్ను బెదిరించటానికి ప్రయత్నిస్తున్నావా? నేను (యోబు) గాలి చెదరగొట్టే ఒక ఆకును. ఎండిపోయిన ఒక చిన్న గడ్డిపరక మీద నీవు దాడిచేస్తున్నావు. |
26
|
దేవా, నా మీద నీవు కఠినమైన మాటలు పలుకుతున్నావు. నేను యువకునిగా ఉన్నప్పుడు చేసిన పాపాలకు నీవు నన్ను శ్రమ పెడుతున్నావు. జోఫరుకు యోబు జవాబు |
27
|
నా సాదాలకు నీవు గొలుసులు వేశావు. నేను వేసే ప్రతి అడుగూ నీవు జాగ్రత్తగా గమనిస్తున్నావు. నా అడుగలను నీవు తక్కువ చేస్తున్నావు. |
28
|
అందుచేత కుళ్లిపోయిన దానిలా, చిమ్మెటలు తిని వేసిన గుడ్డ పేలికలా నేను నిష్ప్రయోజనం అయిపోతున్నాను.” |
Job 13:4 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...