1
|
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము...... నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి |
2
|
ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక. |
3
|
ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక. |
4
|
ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక. |
5
|
ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను |
6
|
యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు? |
7
|
యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. |
8
|
మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. |
9
|
రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. |
10
|
అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. |
11
|
నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. |
12
|
కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. |
13
|
నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను. |
14
|
యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను. |
15
|
నీతిమంతుల గుడారములలోరక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. |
16
|
యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును. |
17
|
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను. |
18
|
యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. |
19
|
నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. |
20
|
ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. |
21
|
నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. |
22
|
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. |
23
|
అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము |
24
|
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. |
25
|
యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. |
26
|
యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము. |
27
|
యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. |
28
|
నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను. |
29
|
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. |
Psalms 118:11 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...