1
|
యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. |
2
|
ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును |
3
|
మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. |
4
|
అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని. |
5
|
యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు. |
6
|
యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను. |
7
|
నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. |
8
|
మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు. |
9
|
సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. |
10
|
నేను ఆలాగు మాటలాడి నమి్మక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను. |
11
|
నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని. |
12
|
యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? |
13
|
రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. |
14
|
యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను |
15
|
యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది |
16
|
యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు. |
17
|
నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను |
18
|
ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను |
19
|
యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. |
Psalms 116:11 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...