1
|
దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము. |
2
|
కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము |
3
|
ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుక లకు పదును పెట్టుదురు. |
4
|
యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు.వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారినికొట్టెదరు |
5
|
వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. |
6
|
వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నిం తురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాని హృదయాంతరంగము అగాధము. |
7
|
దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. |
8
|
వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు |
9
|
మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్య ములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు |
10
|
నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు. |
Psalms 64:8 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...