1
|
యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. |
2
|
ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక. |
3
|
నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక. |
4
|
యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. |
5
|
భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక. |
6
|
వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి. |
7
|
అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును |
8
|
గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును |
9
|
విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి. |
Psalms 149:9 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...