1
|
యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు. |
2
|
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. |
3
|
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. |
4
|
యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. |
5
|
సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు |
6
|
నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక. |
Psalms 128:2 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...