1
|
మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక |
2
|
వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? |
3
|
మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు |
4
|
వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు |
5
|
వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు |
6
|
చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు |
7
|
చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. |
8
|
వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. |
9
|
ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము |
10
|
అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము |
11
|
యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము. |
12
|
యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును |
13
|
పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. |
14
|
యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును. |
15
|
భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు. |
16
|
ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు. |
17
|
మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు |
18
|
మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి. |
Psalms 115:15 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...