1
|
యెహోవా శరణుజొచ్చియున్నానుపక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల? |
2
|
దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారుచీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు |
3
|
పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? |
4
|
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడుయెహోవా సింహాసనము ఆకాశమందున్నదిఆయన నరులను కన్నులార చూచుచున్నాడుతన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. |
5
|
యెహోవా నీతిమంతులను పరిశీలించునుదుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు, |
6
|
దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును. |
7
|
యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడుయథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. |
Psalms 11:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...